- తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవాలు సందర్భంగా తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ : అందరికి దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆధ్యాత్మికత వాతావరణంలో దర్శించుకుంటున్నారని తెలిపారు. పటిష్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారని తెలిపారు.
క్యూలైన్లు అన్ని సజావుగా సాగుతున్నాయని .. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించినట్లు తెలిపారు దాదాపు 4,000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
సమష్టి సహకారంతో రాష్ట్ర పండుగను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రత్యేక అధికారులు కూడా ప్రతి సెక్టార్ లోను విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నచిన్న లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు