The Desk…Indrakeeladri : దుర్గమ్మ దర్శనానికి తొలిరోజు విశేషం గా తరలివచ్చిన భక్తజనం- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం

The Desk…Indrakeeladri : దుర్గమ్మ దర్శనానికి తొలిరోజు విశేషం గా తరలివచ్చిన భక్తజనం- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ఇంద్రకీలాద్రి : ది డెస్క్ :

దసరా శరన్నవరాత్రుల్ని పురష్కరించుకొని ఇంద్రాకిలాద్రి పై జరుగుతున్న ఉత్సవాలకు భక్తులు విశేషం గా తరలివచ్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పూజా కైంకర్యాలతో ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. తొలి రోజు సాయంత్రం గం 5.30 లకు 47,418 మంది భక్తులు అమ్మ వారి దర్శనానికి తరలి వచ్చారున్నారు. రాత్రి గం. 11 వరకు అమ్మవారినీ దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగానున్నదని తెలిపారు.

చిన్నారులు తప్పిపోకుండా 3,441 ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన అన్నదాన కార్యక్రమం లో 14,844 మందికి అన్న ప్రసాదం అందించామన్నారు.

ఉత్సావాల నిర్వహణ పై భక్తుల నుంచి ఆన్లైన్ లో ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు. వాటి ద్వారా భక్తులు సంతృప్తి గా ఉన్నట్లు తెలిసిందని, క్యూ లైన్ నిర్వహణ, ఉత్సవ ఏర్పాట్లు, అమ్మవారి దర్శన విధానం లో ఎటువంటి లోపాలు జరగలేదని భక్తుల నుంచి అభిప్రాయం వచ్చిందన్నారు.

సాయంత్రానికి 22 లక్షలు ఆదాయం

దసరా ఉత్సవాలలో తొలిరోజు సాయంత్ర సమయానికి పలు రకాల సేవల, దర్శన టికెట్ల రూపేణా రూ. 22 లక్షల 72 వేల 214 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మూడు వందల రూపాయలు టిక్కెట్లు 3వేలు విక్రయం కాగా రూ. 9 లక్షలు, వంద రూపాయల టిక్కెట్లు 3,100 విక్రయం తో రూ.3,10,000, 15 రూపాయల లడ్డులు 10 వేలు విక్రయించగా లక్ష యాభై వేలు, వందరూపాయల లడ్డు బాక్స్ లు 7,700 విక్రయంతో రూ.7,70,000 ఆదాయం వచ్చిందన్నారు.

ఇది కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనలు ద్వారా 38 వేలు రూపాయలు, పరోక్షంగా జరిగిన ప్రత్యేక చండీ హోమం ద్వారా 4 వేల రూపాయలు, అదేవిధంగా పరోక్ష ప్రత్యేక శ్రీచక్రనవార్చన నిర్వహించుకోవడంతో 30 వేల రూపాయలు, ప్రత్యేక ఖడ్గమాలార్చాన ద్వారా రూ.20,464 కేశఖండన ద్వారా రూ.56, 800 ఆదాయం వచ్చిందని తెలిపారు.

ఆయన తో పాటు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్, ఈఓ శీనానాయక్, శ్రీకాళహస్తి ఈఓ తదితరులు పాల్గొన్నారు.