The Desk … Hyderabad : యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు

The Desk … Hyderabad : యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు

🔴 హైదరాబాద్ : ది డెస్క్ :

మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమలను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆదివారం పరామర్శించారు.

ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన యనమల రామకృష్ణుడు వైద్యుల సూచన మేరకు స్టెంట్ వేయించుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న ఆయనను ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసిన సానా సతీష్ బాబు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అందుతున్న వైద్య సేవలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.