- తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్, NPDCL DE లను ACB కి పట్టించిన పౌరులకు.. “జ్వాలా” ఆధ్వర్యంలో నగదు పురస్కారాలతో సన్మానం
తెలంగాణ : హనుమకొండ : ది డెస్క్ :
సమాజాన్ని క్యాన్సర్ లా కబళిస్తున్న అవినీతిని అంతం చేయాలంటే ప్రతి పౌరుడు సరిహద్దులోని సైనికుడిలా పోరాడాలని లోక్ సత్త వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలుపుని ఇచ్చారు. అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరూ ప్రథమ కర్తవ్యంగా భావించాలని యువతను కోరారు.
అవినీతి వ్యతిరేక సంస్థ “జ్వాల” ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ లోని లోక్ సత్త జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.
జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ సబ్ రిజిస్టర్ రామకృష్ణను ఏసీబీకి పట్టించిన శివరాజ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ తహశీల్దార్ మాధవిని ఏసీబీకి పట్టించిన గోపాల్.NPDCL DE స్టేషన్ ఘనపూర్ హుసెయిన్ నాయక్ ను పట్టించిన విజయ్ లను జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతున్న అవినీతి మాత్రం తగ్గడం లేదని ఆవేదన. వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని సన్మానిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని డిమాండ్ చేశారు.
జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. అత్యంత అవినీతి కలిగిన దేశాలలో భారత్ 96వ స్థానంలో ఉందని.. ప్రతి ఎట భారతదేశ స్థానం మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అవినీతి కి పాల్పడుతూ ACBకి చిక్కిన ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో లోక్సక్త రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ కోదండ రామారావు, Dr. అంజలి దేవి .జ్వాల సభ్యులు అచ్చే అమర్నాథ్ ప్రకాష్.సురేష్ తదితరలు పాల్గొన్నారు.