The Desk…Guraja : బాధిత కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

The Desk…Guraja : బాధిత కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK NEWS :

అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన బాధిత కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి ఆర్థిక సాయం అందించింది.

మండలంలోని గురజ గ్రామానికి చెందిన ప్రత్తిపాటి వీరాస్వామి (65) ఇటీవల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికిగురై మరణించారు. మృతుని కొడుకు ప్రత్తిపాటి ప్రభు కుమార్ తాపీ పని చేసుకొంటూ జీవిస్తూ.. గతేడాది పనిచేస్తూ బిల్డింగ్పై నుండి పడిపోయి మరణించాడు.

ప్రభు కుమార్ కు ముగ్గురు సంతానం. కొడుకు చనిపోయినప్పటి నుంచి.. మృతుడు వీరాస్వామి ఇద్దరు మనవరాళ్లను, ఒక మనవడి ని పోషణ చూసుకొంటూ.. తన ఆరోగ్యంపట్ల అశ్రద్ధ వహించగా.. తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి బాధిత కుటుంబాన్ని తన తండ్రి డాక్టర్ మనోజ్, కొంతమంది గ్రామ పెద్దలతో కలసి శుక్రవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5వేలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా దాతలెవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.