The Desk…Guntur : పాస్పోర్ట్ దరఖాస్తుల విచారణ సేవల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానం : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

The Desk…Guntur : పాస్పోర్ట్ దరఖాస్తుల విచారణ సేవల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానం : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

గుంటూరు జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం: ది డెస్క్ :

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నాయకత్వాన్ని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివ హర్ష అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు.

జూలై 2024 నుండి జూన్ 2025 మధ్యకాలంలో 30వేలకు పైగా పాస్‌పోర్ట్ దరఖాస్తులను కేవలం 3 రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ స్థానం సాధించి గొప్ప విజయాన్ని నమోదు చేశారు.

విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శివ హర్ష చేతుల మీదుగా గుంటూరు జిల్లా పోలీస్ విభాగం తరపున జిల్లా ఎస్బీ విభాగం సీఐ అలహరి.శ్రీనివాసరావు “అభినందలహరి” అవార్డును అందుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా పోలీస్ విభాగం ఈ గుర్తింపుతో మరింత ప్రోత్సాహంతో ముందుకు సాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.