🔴 కృష్ణా జిల్లా: గుడివాడ : ది డెస్క్ :

అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా.. గుడివాడలోని ఆర్కే జూనియర్ కళాశాలలో విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది కళాశాల యాజమాన్యం…అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులగుటకై 116/- రూపాయలు ఫోన్ పే రూపంలో CRDA అకౌంట్ కి చెల్లించారు.
ఈ సందర్భంగా అంబుల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ…
అమరావతికి జీవం పోద్దాం – 116 రూపాయలు సాయం చేద్దాం… వైష్ణవి పిలుపుమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరూ స్పందించి వారి యొక్క స్తోమత కొలది కనీసం 116 రూపాయలు చెల్లిస్తున్న విధానానికి సంతోషం వ్యక్తం చేస్తూ .. దీనిలో అందరూ పాలిభాగస్తులై ఉండాలన్నారు.

అలాగే మన అమరావతి కలల రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మించుకొందామని, మన రాష్ట్రాన్ని మన రాజధాని మనమే నిర్మించుకుంటే మన పిల్లలు మన కండ్ల ఎదుటే ఉంటారని, ఎక్కడికో సుదూర ప్రదేశాలు వెళ్ళనక్కరలేదని, అకుంఠిత పట్టుదలతో అమరావతి రాజధాని నిర్మాణానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో, మన వంతుగా ఆయనకి సపోర్టుగా నిలిచి ఒక్కొక్కరు 116/-రూపాయలు చొప్పున చెల్లించడమే కాకుండా మన స్నేహితులతో కూడా చెప్పి, ఈ చిన్న విరాళాన్ని CRDA అకౌంట్ కు పంపించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆర్కే కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు 116/- రూపాయలను ఫోన్ పే ద్వారా చెల్లించారు.