కృష్ణాజిల్లా : ఘంటసాల : ది డెస్క్ :
జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధరరావు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ, గుట్టుచప్పుడు కాకుండా జూద కార్యకలాపాలు నిర్వహిస్తే డేగ కన్నుతో పసిగడతామని హెచ్చరిస్తూ, ఎక్కడికక్కడ వారి ఆటలకు కళ్లెం వేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు.
అందులో భాగంగా బుధవారం ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పాప వినాశనం కరకట్ట వద్ద పేకాట ఆడుతున్నారని అవనిగడ్డ డిఎస్పి విద్యశ్రీ కి అందిన సమాచారం మేరకు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయగా, ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డి సిబ్బంది తో పేకాట ఆడుతున్న వారిని గుర్తించి, వారిపై మెరుపు దాడి చేసి, 8 మందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 740/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘంటసాల పోలీస్ స్టేషన్ నందు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.