కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK NEWS :
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో కృష్ణానది కరకట్ట పై వేంచేసియున్న గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మరియు పరివార దేవతలు దేవాలయ 26వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవము సోమవారం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేదపండితులు చుండూరు నాగ భాస్కరాచార్యులు, చుండూరు నాగ హేమంతాచార్యులు అర్చకత్వంలో సుప్రభాతం, స్వామి వారి అభిషేకాలు, అలంకారములు చేసి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, అఖండ స్థాపన, అంకురారోహణ, మండపారాధన చేశారు.
అనంతరం గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణం మచిలీపట్నంకు చెందిన చిలకలపూడి శంకరరావు – వరలక్ష్మీ దంపతులచే భక్తజనసందోహం మద్య మేళతాళాలతో, వేదమంత్రోచ్చరణలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం 2500 మందికి భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం పరిసర గ్రామాల నుంచి మహిళలు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.