The Desk… Ghantasala : కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా సుధారాణి బాధ్యతలు స్వీకారణ

The Desk… Ghantasala : కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా సుధారాణి బాధ్యతలు స్వీకారణ

కృష్ణా జిల్లా : ఘంటశాల : THE DESK :

ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తగా డాక్టర్ డి. సుధారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

డా. సుధారాణి ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా విధులను నిర్వర్తించి బదిలీపై ఘంటసాలకు వచ్చారు.

కేవీకే శాస్త్రవేత్తలు సమన్వయంతో రైతులకు పలు సూచనలు అందజేస్తామన్నారు.

రైతులకు మేలైన విత్తనాలు అందించడంతో పాటు సస్యరక్షణ, సస్య పోషణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను గూర్చి వివరిస్తామన్నారు.

చేపల, పెంపకం, కోళ్లు, మేకలు పెంపకం, తేనెటీగలు పెంపకం, పుట్టగొడుగుల పెంపకం తదితర అంశాలపై విడతలు వారీగా నిర్వహించే శిక్షణలను రైతులు వినియోగించుకోవాలన్నారు.

డాక్టర్ సుధారాణిని కేవీకే శాస్త్రవేత్తలు వి. మంజువాణి, బి. నవీన్, జీ. కృష్ణవేణి, ఎం. వెంకటలక్ష్మి, సుబ్బారెడ్డి, సాయి తదితరులు అభినందించారు.