కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK :
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఘంటసాల ఎస్సై ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. దివిగాంధీ, మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మోపిదేవిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు గ్రామీణ యువజన వికాస్ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఘంటసాల ఎస్సై ప్రతాప్ రెడ్డి రక్తదానం చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారికి రక్తం అవసరం ఉంటుందని.. రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అని అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి అన్నారు.
రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన ఘంటసాల ఎస్సై ప్రతాప్ రెడ్డిని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరీ బాబు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), టీడీపీ సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, ఐనపూడి భాను ప్రకాష్ తదితరులు అభినందించారు.