కృష్ణాజిల్లా : ఘంటసాల : ది డెస్క్ :
క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఘంటసాల ఎస్ఐ వేమన చందన అన్నారు.ఘంటసాల పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు నిర్వహించిన ఎస్ఐ చందనను మండలంలోని గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు సోమవారం మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చందన మాట్లాడుతూ.. ఘంటసాల మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల్లోని సచివాలయాల పరిధిలో ఏమి జరిగిన మహిళా పోలీసులు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
ఘంటసాల ప్రధాన సెంటర్ తో పాటు ప్రధాన గ్రామాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తానన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. పేకాట, కోడి పందాలు, జూదాలు, చిత్తులాట ఇతర అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తే సంబందిత వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
స్టేషన్కు వచ్చే బాధితులకు చట్టానికి లోబడి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు.ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా సహకారంతో ఘంటసాల మండలాన్ని శాంతి భద్రతలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా తమ సిబ్బందితో కలసి తన వంతు కృషి చేస్తానని ఎస్ఐ వేమన చందన తెలియజేశారు.
కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వి.నాగేశ్వరరావు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

