కృష్ణాజిల్లా : ఘంటసాల : శ్రీకాకుళం :
ఘంటసాల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం శాంతి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది.
కార్యక్రమం ప్రారంభం సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పవిత్రవిసర్జన, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ స్వామివార్లకు శాంతి కల్యాణం ఘనంగా జరిగింది.
ఈ పవిత్ర మహోత్సవనికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. దంపతులు స్వామివార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు స్వామివారి అశీర్వచనాలు అందించి, శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), నేతలు కుంపటి చిట్టిబాబు, శీలం శ్రీనివాస్, దాసం రామకృష్ణ, కొండవీటి నాని, కోటి, వినయ్, శ్రీను తదితరలు పాల్గొన్నారు.