- వర్షపు నీటికి గోడలు, తలుపులకు విద్యుత్ సరఫరా
- స్వామివారికి దీపదూప నైవేద్యాలకు అంతరాయం
కృష్ణాజిల్లా : ఘంటసాల : శ్రీకాకుళం : ది డెస్క్ :
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న ఏక రాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయంతో పాటు గర్భగుడిలోకి నీరు చేరుకుంది.దీంతో స్వామి వారికి పూజలు నిర్వహించాలన్న, భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలన్న ఇబ్బందులు తప్పడం లేదు.
క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయం పల్లపు ప్రాంతంలో ఉండటం వల్ల భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ముంపున గురవుతుంది దేవాతయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పురాతన దేవాలయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ దేవాలయం పరిధిలో 40 ఎకరాలు పంట పొలాలు ఉన్నా సరైన పర్యవేక్షణ లేక అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటుంది.ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఆలయ పునః నిర్మాణం చేసి శ్రీ ఏక రాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి పూర్వ వైభవం కల్పించాలని అర్చకులు, గ్రామస్తులు కోరుతున్నారు.