కృష్ణాజిల్లా : ఘంటసాల : ది డెస్క్ :
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. జూద కార్యకలాపాలైన, ఆకతాయిల వేధింపులైన, బహిరంగ మద్యం సేవనమైన, చట్ట వ్యతిరేక చర్యలు ఏవైనా వారి ఆట కట్టిస్తామని కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తున్నారు.
అందులో భాగంగా బుధవారం ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పూషడం డొంక రోడ్డు నందు కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు డ్రోన్ కెమెరా సాయంతో కోడిపందాలు ఆడుతున్న ఐదు మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద నుండి 2 కోడిపుంజులు, 2 కోడి కత్తులు, 2200/- నగదును స్వాధీనం చేసుకొనీ నిందితులను స్టేషన్ తరలించి ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేశారు.