కృష్ణా జిల్లా : ఘంటసాల ది డెస్క్ :
ఘంటసాల మండల తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ ఉత్తమ తహసీల్దార్ గా శుక్రవారం జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ చేతులు మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఘంటసాల మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో నాణ్యమైన సేవలందిస్తూ.. ప్రజా ప్రతినిధులు, ప్రజల మన్ననలు పొందుతున్న తహసీల్దార్ విజయ ప్రసాద్ ఉత్తమ తహసీల్దార్ గా ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల ఘంటసాల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలియజేశారు.