మండలంలో మహారాష్ట్ర రెవెన్యూ అధికారుల అధ్యయన పర్యటన..రీసర్వే, భూసమాచార నిర్వహణ
కృష్ణా జిల్లా : గన్నవరం : ది డెస్క్ :
కృష్ణా జిల్లా కలెక్టర్ D.K. Balaji ఆదేశాల మేరకు, మహారాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం తేదీ 28-02-2026 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యయన పర్యటనకు వచ్చింది.
ఈ అధ్యయన బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనలో అమలవుతున్న నూతన, వినూత్న మరియు విజయవంతమైన ఉత్తమ విధానాలను (Best Practices) ప్రత్యక్షంగా పరిశీలించుటకు పర్యటన చేపట్టింది. ఇందులో ముఖ్యంగా
భూసర్వే మరియు రీ-సర్వే విధానం,
భూ రికార్డుల నిర్వహణ,
మ్యూటేషన్ మరియు ఆటో మ్యూటేషన్ ప్రక్రియ,
గ్రామ సచివాలయాలు / స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు సేవల అమలు విధానం,
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయం వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
📌 మహారాష్ట్ర అధ్యయన బృంద సభ్యులు
- శ్రీ. జితేంద్ర పాపా ల్కర్, IAS డివిజనల్ కమిషనర్, ఛత్రపతి సంభాజీనగర్ (మహారాష్ట్ర)
- శ్రీ రాహుల్ కర్డిల్ IAS , జిల్లా మేజిస్ట్రేట్, నాందెడ్.
- పాండురంగ్ భోర్గాంకర్ . అదనపు కలెక్టర్ (సర్వీసు గ్రేడ్), లాతూర్
- అరుణ్ పేడే తహసీల్దార్
- విజయ్ వీర్ , జిల్లా భూ రికార్డుల అధికారి , శంబాజి నగర్, మహారాష్ట్ర
- విజయ్ భలే రావు డిప్యూటీ ఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ. శంబాజి నగర్.
📌 గన్నవరం మండలంలో అధ్యయన పర్యటన వివరాలు
మహారాష్ట్ర రెవిన్యూ బృందం ఈ సందర్భంగా గన్నవరం తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి,
భూ రికార్డుల డిజిటలైజేషన్,
రీ-సర్వే ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు,
రైతులకు, ప్రజలకు అందుతున్న పారదర్శక సేవలపై
సమగ్ర అవగాహన పొందింది.
అలాగే గన్నవరం జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, వెంకట నరసింహపురం గ్రామ సచివాలయంలను సందర్శించి, రెవెన్యూ–రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు వేగవంతమైన సేవలు ఎలా అందుతున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు.
📌 ఫీల్డ్ విజిట్ – రీసర్వే గ్రామాలు
బృందం గన్నవరం మండలంలోని
రీ-సర్వే పూర్తైన గ్రామం వెంకట నరసింహ పురం,
రీ-సర్వే కొనసాగుతున్న గ్రామం గన్నవరం గ్రామా
లను సందర్శించి, భూముల కొలతలు, సరిహద్దుల ఖచ్చితత్వం, రైతుల అభ్యంతరాల పరిష్కార విధానం, నోటీసుల జారీ, గ్రామ సభల నిర్వహణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
గుడివాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, జి. బాల సుబ్రమణ్యం, జిల్లా సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారి, పి. లక్ష్మణ రావు, జిల్లా రిజిస్ట్రార్ గోపాల కృష్ణ మూర్తి, తహసీల్దార్ గన్నవరం కె.వి శివయ్య. గన్నవరం సబ్ రిజిస్ట్రార్ , ప్రసాద్. కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న రీ-సర్వే, భూ రికార్డుల ఆధునీకరణ, ప్రజా సేవల సరళీకరణ విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మహారాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించింది.
ఈ అధ్యయన పర్యటన ద్వారా రాష్ట్రాల మధ్య అనుభవాల పరస్పర మార్పిడి జరిగి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రజాసేవల అమలుకు దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

