కృష్ణా జిల్లా : గన్నవరం : ది డెస్క్ :
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్సార్ ఫండ్స్ విరివిగా కేటాయించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్సీఎల్ ప్రతినిధులతో యార్లగడ్డ సమావేశం అయ్యారు.
గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన హెచ్సీఎల్ సంస్థకు యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే రీతిగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు, తాగునీటి సమస్య పరిష్కారానికి హెచ్ సి ఎల్ సంస్థ నుండి సి ఎస్ ఆర్ ఫండ్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా యార్లగడ్డ కోరారు.
నియోజకవర్గం లోని కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయా గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ లు ఏర్పాటు చేసేందుకు సి.ఎస్.ఆర్ నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు. యార్లగడ్డ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన హెచ్సీఎల్ ప్రతినిధులు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో హెచ్సిఎల్ అడ్మిన్ ఆపరేషన్ లీడ్ జి. శ్రీనివాసరావు, హెచ్సిఎల్ ఫౌండేషన్ స్టేట్ ఇంచార్జ్ బి. శ్రీనివాసులు, గన్నవరం నియోజకవర్గ ప్రత్యేక అధికారి షాహిద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

