కృష్ణా జిల్లా : కొండపావులూరు (గన్నవరం) : THE DESK :
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం గన్నవరం మండలం, కొండపావులూరులో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థల పరిశీలన చేశారు.
గురువారం సాయంత్రం ఆయన జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి కొండపావులూరు సర్వే నంబర్ 6లో ఉన్న 42 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.
గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి, గన్నవరం తహసిల్దార్ శివయ్య తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.