ఏలూరు జిల్లా : గాలాయగూడెం : THE DESK NEWS :

దెందులూరు నియోజకవర్గంలోని గాలాయగూడెం గ్రామంలో విలాసిల్లుతున్న శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల తిరుణాల 68వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ రావు శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాలు తిరుణాలను ప్రారంభించారు. అదేవిధంగా దేవాలయంలో అచ్చమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ.. గాలయగూడెం లోని శ్రీశ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల తిరునాళ్లకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని.. ఈ ఉత్సవాలు ఈ రోజు నుంచి 12వ తారీకు వరకు వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ వైభవంగా నిర్వహించిందన్నారు.
ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని ఈ సందర్భంగా అధికారులు, కమిటీ నిర్వాహకులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో దెందులూరు నియోజకవర్గం చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.