The Desk…Eluru : PGRS దరఖాస్తుల పరిష్కార విధానంపై నేరుగా దరఖాస్తుదారులకు జిల్లా కలెక్టర్ ఫోన్…ధరఖాస్తుదారుని సంతృప్తి పై కలెక్టర్ ఆరా

The Desk…Eluru : PGRS దరఖాస్తుల పరిష్కార విధానంపై నేరుగా దరఖాస్తుదారులకు జిల్లా కలెక్టర్ ఫోన్…ధరఖాస్తుదారుని సంతృప్తి పై కలెక్టర్ ఆరా

  • దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిందే: అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : ది డెస్క్ :

ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఫిర్యాదుదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా తమ సమస్యలను తెలియజేసుకున్న దరఖాస్తులలో సమస్యలు పరిష్కారం అయిన ప్రజలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం సాయంత్రం తాను స్వయంగా ఫోన్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

నూజివీడు మండలం బొర్వాంచ గ్రామానికి చెందిన గ్రామస్తులు రీసర్వే లో తన భూమి విస్తీర్ణం తగ్గిందని ఒకరు, తనకు పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేయలేదని మరొకరు వినతులు సమర్పించగా, సదరు దరఖాస్తులను పరిశీలించిన అధికారులు సమస్యలను పరిష్కరించారు. సదరు పరిష్కార విధానంపై ధరఖాస్తుదారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నేరుగా ఫోన్ చేసి మీ వద్దకు వచ్చి సమస్యను గురించి తెలుసుకున్నారా.. దరఖాస్తుదారుల పట్ల అధికారుల ప్రవర్తన, మాటతీరు, తదితర అంశాలను ఫిర్యాదుదారులు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా కలిదిండి మండలం కోరుకొల్లు, మండవల్లి మండలం గన్నవరం గ్రామాలకు చెందిన గ్రామస్థులు తమ గ్రామాలలో పారిశుధ్యం సక్రమంగా లేదని, చెత్తను తొలగించడం లేదని PGRS లో ఫిర్యాదు చేయగా, అధికారులు వాటిని పరిష్కరించారు. వీటిపై సదరు దరఖాస్తుదారులకు కలెక్టర్ వెట్రిసెల్వి నేరుగా ఫోన్ చేసి, పరిష్కార విధానం, వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు.

ఇదే విధంగా పలువురు దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వారి దరఖాస్తుల పరిష్కార విధానంపై సంతృప్తి చెందారా.. అధికారుల ప్రవర్తన, తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. PGRS దరఖాస్తుల పరిష్కారంలో అధికారులందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, ధరఖాస్తుదారుని కలిసి వారి సమస్యలను తెలుసుకుని అర్హత కలిగిన అంశాలలో నాణ్యమైన రీతిలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.