The Desk…Eluru : MP కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

The Desk…Eluru : MP కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

  • ఘనంగా నివాళులు అర్పించిన ఎస్సీ సంఘం నాయకులు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం, ప్రజా సంఘాలు, కూటమి నాయకులు, కార్యాలయం సిబ్బంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ… సమ సమాజ స్థాపనకై, దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పలు సంస్కరణలకు బీజం వేసిన దార్శనికుడని కొనియాడారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆంజనేయులు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు, లంకపల్లి మాణిక్యాలరావు , ఎరికిపాటి విజయ్ కుమార్, నూతలపాటి నవీన్ రాజు, పల్లి విజయకుమార్, దయాల ప్రదీప్, పిడిగే రాకేష్, పిట్టా రాహుల్, లంకపల్లి బాలు, సిహెచ్ నాని, తదితరులు పాల్గొన్నారు.