The Desk…Eluru : రహదారి భద్రత పై అవగాహన

The Desk…Eluru : రహదారి భద్రత పై అవగాహన

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగముగా శనివారం కలపర్రు జాతీయ రహదారిపై రవాణా శాఖ తనిఖీ అధికారులు వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భముగా హెల్మెట్ ను ధరించి ద్విచక్ర వాహనాలను నడిపే వారికి మరియు సీటు బెల్టును ధరించి కారును నడిపే వాహన చోదకులకు రవాణా శాఖ తనిఖీ అధికారులు గులాబి పువ్వులను అందించి ప్రశంసలు తెలియచేశారు.

అదేసమయములో హెల్మెట్ను మరియు సీటు బెల్టు ధరించకుండా వాహనాలను నడిపే చోదకులను ఆపి వారికి హెల్మెట్ మరియు సీట్ బెల్టు ధరించడము వలన కలిగే ఉపయోగాలను మరియు వాటిని ఉపయోగించడము వలన ప్రమాదాల తీవ్రతను తగ్గించు కోవచ్చునని తెలిపారు.

వాహనదారులకు రహదారి భద్రతా నియమాలను తెలియచేసే రవాణా శాఖ కరపత్రాలను అందించారు.ఈ కార్యక్రమములో వాహన తనిఖీ అధికారులు జి.స్వామి, వై.ఎస్.వి. కళ్యాణి, పి.నరేంద్ర బాబు పాల్గొన్నారు.