- ఫిబ్రవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులతో అమలు..
- రోడ్డు భధ్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి..
జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు :THE DESK NEWS :
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావల్సిందేనని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్ధాయి రోడ్డు భధ్రతా కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె.పి. ఎస్. కిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రహదారి భధ్రతా, రోడ్డు భధ్రతా వారోత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ..వాహన చోధకుల నిర్లక్ష్యం,ఇతర కారణంగా ప్రమాదాలతో వారి కుటుంబాలకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు భధ్రతా నియమాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇప్పటికే ఈవిషయంపై అన్నిస్ధాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
హెల్మెట్ ధారణపై మరింత విస్త్రృత చర్యల్లోభాగంగా తొలిగా ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలనే నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమలు అమలు చేయాలన్నారు.
ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భధ్రతా నిబంధనలను ప్రజలతోపాటు అధికారులు కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులందరూ విధిగా హెల్మెట్ ధారణపై సూచించిన మేరకు రావల్సివుంటుందన్నారు.
అదే విధంగా కళాశాలలకు వచ్చే విద్యార్ధులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రవాలనే నిబంధన ఆయా యాజమాన్యాలు అమలుచేయాలన్నారు. కళాశాలకు వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించి రాకపోతే నో ఎంట్రీ అని స్పష్టం చేయాలన్నారు. ఒకటికి రెండుసార్లు తొలిగా హెచ్చరించి తదుపరి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఆయా కళాశాలల్లో నోహెల్మెట్-నోఎంట్రి విధానం అమలు అవుతున్నదీ లేనిదీ సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు.
ఈ విషయంపై ఆయా కళాశాలల యాజమాన్యాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.