The Desk…Eluru : ఎంపీ పుట్టా మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

The Desk…Eluru : ఎంపీ పుట్టా మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు, ఎంపీ కార్యాలయం సిబ్బంది మొదట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం కైకలూరు రోడ్డులోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ప్రేమాలయంలోని వృద్ధులకు భోజన వసతి కల్పించారు.

నాయకులు, ఎంపీ కార్యాలయం సిబ్బంది వృద్ధులకు దగ్గరుండి భోజనం వడ్డించారు. కార్యక్రమంలో నాయకులు నందిగం సీతారామ్ తిలక్ ( బాబి), కాట్రు బాలకృష్ణ (బాలు), వీర్ల ప్రతాప్, ఆలూరి రమేష్, మన్నె అశోక్ గజిపతి రాజు, కిలారపు జగదీష్, శాఖమూడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.