ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
పోలీసు ఉద్యోగులకి ఒక సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్న జనవరి-2024 కు సంబంధించిన అడిషనల్ సరెండర్ లీవ్ శాలరీ బకాయిలు, జూన్ 2024 వరకు సప్లమెంటరీ సరెండర్ లీవ్ శాలరీ బిల్స్, జి.పి.ఎఫ్, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను వెంటనే మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆం.ప్ర.పోలీసు అధికారుల సంఘం, ఏలూరు జిల్లా, ఏలూరు సిబ్బంది మరియు వారి కుటుంబాల తరుపున ప్రత్యేక కృత్ఞతలు తెలుపుతున్నట్లు ఏలూరు జిల్లా ఆం. ప్ర. పోలీసు అధికారుల సంఘము ప్రెసిడెంట్ ఆర్. నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.