The Desk…Eluru : మాజీ సర్పంచి కుటుంబ సభ్యులకు ఎంపీ పుట్టా మహేష్ పరామర్శ

The Desk…Eluru : మాజీ సర్పంచి కుటుంబ సభ్యులకు ఎంపీ పుట్టా మహేష్ పరామర్శ

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఇటీవల కన్నుమూసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతలపూడి మండలం యర్రంపల్లి మాజీ సర్పంచి దివంగత పాకనాటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం పరామర్శించారు. యర్రంపల్లిలోని ఇంటికి వెళ్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటామని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడిగా నాగేశ్వరరావు గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఎంపీ కొనియాడారు. నాగేశ్వరరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.