The Desk…Eluru : జిల్లాలో ధాన్యం కొనుగోలు భేష్ : మంత్రి నాదెండ్ల మనోహర్

The Desk…Eluru : జిల్లాలో ధాన్యం కొనుగోలు భేష్ : మంత్రి నాదెండ్ల మనోహర్

  • రూ. 734 కోట్ల విలువైన 3.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..
  • 96 శాతం రైతులకు 24 గంటల్లోనే సొమ్ము చెల్లింపులు..
  • జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ..

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటిగా ఏలూరు జిల్లాలో ప్రారంభమై అదే దిశగా కొనుగోళ్లలో జిల్లా అధికారులు చూపిన చొరవను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం ఏలూరు విచ్ఛేసిన రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సేకరణపై మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో రూ. 733.91 కోట్ల విలువైన 49,022 మంది రైతుల నుంచి 3,58,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం భేషుగ్గా ఉందన్నారు. సంబంధిత రైతులకు సొమ్ముకూడా చెల్లింపు చేయడం అభినందనీయమన్నారు.

పౌర సరఫరాల రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ దానికి మిన్నగా ధాన్యం కొనుగోలు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లను మంత్రి అభినందించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి నేతృత్వంలో పౌర సరఫరాల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. వీరందరిని ఈ సందర్బపంగా ప్రత్యేకంగా మంత్రి నాదెండ్ల మనోహార్ ప్రత్యేకంగా అభిందించారు. నాలుగు సంవత్సరాల అనంతరం రైతులు నిజమైన సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చాలా సమర్ధవంతంగా, పటిష్టవంతంగా జరిగిందన్నారు.

ఏలూరు జిల్లాలో సుమారు మరో 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులుతమ దృష్టికి తీసుకు వచ్చారని తప్పకుండా ప్రతిధాన్యం కూడా ప్రభుత్వం నుంచి కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లను అభినందించారు.