The Desk…Eluru : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూటమి ఎప్పుడూ అండగా ఉంటుంది : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూటమి ఎప్పుడూ అండగా ఉంటుంది : ఎంపీ పుట్టా మహేష్

  • ఎంఎల్ఏ బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి అభి ఇంటీరియల్స్ మాడ్యులర్ కిచెన్ కప్ బోర్డ్ పరిశ్రమను ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ..కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు ఇండస్ట్రియల్ ఏరియాలో పిఎంఇజిపి పథకం ద్వారా నూతనంగా ప్రారంభించిన అభి ఇంటీరియల్స్ మాడ్యులర్ కిచెన్ కప్ బోర్డ్ పరిశ్రమను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఆధునిక యంత్ర పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేస్తూ ఆర్ధిక తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ సూచించారు. ఎంఎల్ఏ బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ సాధారణ కార్పెంటర్ సోదరులు ప్రభుత్వ సహాయాన్ని అందుకొని పరిశ్రమను స్థాపించడం అభినందనీయమన్నారు. పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని ఎంఎల్ఏ తెలిపారు.