భవిష్యత్ లో మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి.. కె.వెట్రి సెల్వి
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
జాతీయ సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబరచిన బలగ స్వామినాయుడును జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు. విజయవాడ లో ఈనెల 27 నుండి 29 వరకు నిర్వహించిన 35వ జాతీయ సౌత్ జోన్ లో జిల్లాకు చెందిన బలగ స్వామినాయుడు 50 మీటర్ల “బటర్ ఫ్లై” విభాగం లో 3వ స్థానం లో నిలిచి బ్రాంజ్ మెడల్ ని కైవసం చేసుకున్నాడు.
సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో డిఎస్ డివో బి. శ్రీనివాస రావు తో కలిసి స్వామినాయుడు జిల్లా కలెక్టర్ ను కలవగా.. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లు స్వామినాయుడును అభినందించి భవిష్యత్ మరిన్ని విజయాలు సాధించాలని.. చదువులో కూడా బాగా రాణించి ఉన్నతస్ధాయికి ఎదగాలని అభినందించారు.
అదే విధంగా బుడిగిన భవానీ, రవి కార్తీక్ 4×200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే విభాగం లోనూ 4×100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే విభాగం లోనూ ఆంధ్రప్రదేశ్ టీమ్ 2వ స్థానం లో నిలిచి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకోవడం ప్రసంశనీయమన్నారు.
ఈ సందర్బంలో స్వామినాయుడును నీకు ఏమికావాలని జిల్లా కలెక్టర్ అడగగా… జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా స్విమ్మింగ్ రేసింగ్ సూట్ అవసరమని తెలియజేయగా.. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ.. స్విమ్మింగ్ రేస్ సూట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భoగా డిఎస్ డివో బి.శ్రీనివాసరావు, కోచ్ బి.గణేష్ ను కూడా అభినందించారు.