The Desk…Eluru : రూ.97 కోట్లతో ఆర్.అండ్.బీ రహదారుల అభివృద్ధి

The Desk…Eluru : రూ.97 కోట్లతో ఆర్.అండ్.బీ రహదారుల అభివృద్ధి

  • ఎంపీ కృషితో మారుతున్న రహదారుల రూపురేఖలు
  • గుంతల రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న మహేష్ కుమార్
  • ఉజ్వల ప్రగతి దిశగా అడుగులు
  • ఆరు నెలల్లో అభివృద్ధి వీచికలు

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

ఏలూరు జిల్లా సమగ్రాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధికి అవసరమైన విధుల మంజూరుకు ఎంపీ తన వంతు కృషి చేశారు.

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నూతన రహదారుల నిర్మాణం, రహదారుల విస్తరణ, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.97 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో కీలకమైన ఏలూరు- జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారితోపాటు మరికొన్ని రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

జిల్లాలోని కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల పరిధిలో 13 రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి.

గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నిర్వాహకంతో నరకం చూసిన ప్రజలు :

గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. కనీసం మరమ్మతులు చేపట్టేందుకు కూడా జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయకపోవడంతో ఏలూరు జిల్లా పరిధిలోని రహదారులు అద్వానంగా తయారయ్యాయి. రాళ్లు లేచిపోయి గుంతలు పడిన రహదారుల్లో రాకపోకలు సాగించడానికి జిల్లా వాసులు ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకం అనుభవించారు.

కొన్ని రహదారులు కొద్దిపాటి వర్షాలకే బురదకయ్యగా మారి అడుగు తీసి అడుగు వేయలేని విధంగా దుర్భరంగా మారాయి. గుంతల బారినపడి పలువురు మృత్యువాత పడగా, మరికొందరు గాయాల పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రహదారుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎంపీగా గెలిచిన మరుక్షణమే జిల్లాలోని రహదారుల దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా నేడు ఏలూరు జిల్లాలో ఆర్ అండ్ బి రహదారుల రూపురేఖలు మారుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత ఏలూరు జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ఎంపీ మహేష్ కుమార్ పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి రవాణా రంగంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో రహదారుల సమస్య పరిష్కారంపై ఎంపీ మహేష్ కుమార్ దృష్టి సారించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మురంగా జరుగుతున్నాయని ఆర్ అండ్ బీ శాఖ ఎస్ఈ జాన్ మోషే తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లలో పూర్తిస్థాయిలో రహదారుల అభివృద్ధి :

ఐదేళ్లలో ఏలూరు జిల్లా పరిధిలోని రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఇప్పటికే పలు రహదారుల అభివృద్ధి పనులు జరుగుతుండగా, మరికొన్ని రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాను. ఈ మేరకు ఇటీవల మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశాను. ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను అభివృద్ధి చేయడమే ప్రతిపాదన ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచని ప్రతి రహదారి అభివృద్ధికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి నావంతు కృషి చేస్తాను.

పుట్టా మహేష్ (ఏలూరు ఎంపీ)