🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా క్రాస్ కంట్రి అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించి జూనియర్, సీనియర్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 23న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుళ్ళప్రసాదరావు, దేవరపల్లి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
అండర్ -16 నుంచి 20 ఏళ్ళలోపు పురుషులు, మహిళా విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టినతేదీ ధ్రువ పత్రం, 10వ తరగతి మార్కులలిస్ట్ తీసుకురా వాలన్నారు.
ఎంపికైన క్రీడాకారులు జనవరి 5న తణుకులో జరిగే క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు.
అదేరోజు ఏలూరు జిల్లా నిడ్ జెమ్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు 14 నుంచి 16 ఏళ్ళలోపు వారికి ఎంపికలు నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారo కొరకు 62814 31202 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.