- ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎంపీ మహేష్ కుమార్
- ఎంపీ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన మహేష్ కుమార్
- ప్రగతి బాటలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్టా మహేష్ కుమార్ చట్టసభలో అడిగిపెట్టి ఆరు నెలలు పూర్తయింది. ప్రజలు కోరుకున్న ఎంపీ కాబట్టి వారి ఆకాంక్షల మేరకు సంక్షేమం, నిశ్చింతతో కూడిన ప్రగతి పాలనను మహేష్ కుమార్ అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపీ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన మహేష్ కుమార్ ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి వన్నె తెచ్చేలా ఏలూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్పష్టమైన అవగాహనతో అవసరమైన నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా వినతి పత్రాలు అందజేశారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబట్టిన నిధులతో ఆరు నెలల కాలంలోని ఏలూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. రైతులు, యువత సమస్యలను అవకాశం ఉన్నంత మేరకు పరిష్కరించారు.

పోలవరం ప్రాజెక్టుపై ఎంపీ ఫోకస్ :
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిర్వాహకం వల్ల మందగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతపై ఎంపీ మహేష్ కుమార్ లోక్ సభలో తన గళం వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు కావడంలో ఎంపీ మహేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

అన్నదాతలకు అండగా ఎంపీ మహేష్ కుమార్:
పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నామని పామాయిల్ సాగు చేస్తున్న ఏలూరు ప్రాంత రైతులు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్నదాతల సమస్యను ఆలకించిన మహేష్ కుమార్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా పామాయిల్ దిగుమతులపై 27.5 శాతం సుంకం విధింపు ద్వారా ప్రస్తుతం రైతన్నలకు రూ.20 వేలు గిట్టుబాటు ధర లభించింది. ఒక్క ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాకుండా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పామాయిల్ సాగు చేస్తున్న రైతులు ఎంపీ మహేష్ కుమార్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు శాలువాలు కప్పి ఎంపీ కృషిని ప్రశంసించారు. తమ సమస్యను కూడా పరిష్కరించాలని వర్జినియా పొగాకు సాగు చేస్తున్న రైతులు చేసిన విజ్ఞప్తిని ఎంపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా వర్జినియా పొగాకు రైతులకు రూ.110 కోట్ల లబ్ధి చేకూరింది.

వందే భారత్ రైలు ఏలూరులో ఆగింది :
విశాఖపట్నం, సికింద్రాబాద్ నడుమ ఏలూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్ లో హాల్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఏలూరు నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ వందే భారత్ రైలులో ప్రయాణించాలనే ఏలూరు జిల్లా ప్రజల కలను ఎంపీ మహేష్ కుమార్ సహకారం చేశారు. ఎంపీ కృషితో ఏలూరు రైల్వేస్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్టు అనుమతి లభించింది.

యువతకు ఎంపీ మహేష్ కుమార్ బాసట:
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యువతకు బాసటగా నిలిచారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏలూరులో భారీ జాబ్ మేళా నిర్వహించారు. విద్యార్హత, నైపుణ్యాలు కలిగిన యువతకు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడేందుకు ఎంపీ చేయూతనందించారు.

వరద బాధితులకు ఎంపీ సాయం:
సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఎంపీ మహేష్ కుమార్ తన వంతు ఆర్థిక తోడ్పాటు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల చెక్కు అందజేశారు.