- – హెల్త్ కేర్ నిపుణుల భద్రత కొరకు శిక్షణా తరగతులు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఆశ్రం మెడికల్ కాలేజి మరియు ఆశ్రం హాస్పిటల్స్ నందు హెల్త్ కేర్ నిపుణుల భద్రత కొరకు జరిగిన శిక్షణా తరగతులు బి.డి కంపెనీ సహకారంతో నర్సింగ్ మరియు టెక్నికల్ సిబ్బంది కొరకు భద్రమైన ఇన్ఫ్యూజన్ శిక్షణా తరగుతులు నిర్వహించడం జరిగింది. వివిధ రకాల పద్ధతులలో రోగులకు క్షేమకరమైన విధంగా ఇంజెక్షన్ ఇవ్వడం వంటి ఆధునిక మెలకువలపై అవగాహాన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమం తేది, 03 డిసెంబరు 2024 నుండి 05 డిసెంబరు 2024 వరకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ వారు ఆశ్రం హాస్పిటల్లోని స్కిల్ ల్యాబ్ నందు నిర్వహించటం జరిగింది.ఈ శిక్షణలో సుమారు 400 మంది హాస్పిటల్ సిబ్బంది పాల్గొని వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం జరిగిందని మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చేబ్రోలు శ్రీనివాస్ గారు తెలిపారు.
శిక్షణా తరగుతులకు ఆశ్రం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. కె. శాంతయ్య గారు, మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపల్ డా. వేణు గోపాలరాజు గారు, హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యస్. రాజరాజన్ గారు, హెచ్.ఐ.సి.సి చైర్పర్సన్ డా. రవిచిత్ర కె.న్ గారు, ఇతర వైద్యులు మరియు బి.డి కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.