The Desk… Eluru : దేశవ్యాప్తంగా అందుబాటులో 136 వందే భారత్ రైళ్ల సేవలు

The Desk… Eluru : దేశవ్యాప్తంగా అందుబాటులో 136 వందే భారత్ రైళ్ల సేవలు

  • ఎంపీ పుట్టా మహేష్ర్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి అశ్విని వైష్ణవ్.

దిల్లీ / ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

దేశ వ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, సమాచారం, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

100 వందే భారత్ రైళ్ల టెండర్ ప్రక్రియ రద్దు వెనుక కారణాలేంటని, టెండర్లు రద్దు చేయడం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన దేశీయ రైలు పరిశ్రమ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందా అని ఎంపీ ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేయడం వల్ల కొత్త రైళ్ల సేకరణలో మరింత జాప్యం, అడ్డంకులు ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

అంతేకాకుండా దీర్ఘ, మధ్యస్థ అంతర్-రాష్ట్ర ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశ పెడుతున్నామని, ప్రస్తుతం 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు తయారీలో ఉన్నాయని, భారతీయ రైల్వేలు 50 వందే భారత్ స్లీపర్ స్లీపర్ రేక్‌ల ఉత్పత్తికి కూడా ఏర్పాటు చేసిందని, అదనంగా 200 వందే భారత్ స్లీపర్ రేక్‌ల తయారీకి సంబంధించిన కాంట్రాక్టులు కూడా టెక్నాలజీ పార్టనర్స్‌కు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.