The Desk… Eluru : పశువైద్యశాల నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టండి : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

The Desk… Eluru : పశువైద్యశాల నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టండి : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

  • ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు

ఏలూరు జిల్లా : THE DESK :

పోలవరం మండలం కొత్తపట్టిసీమలో పశువైద్యశాల నూతన భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ను ఆదేశించారు.

కొత్తపట్టిసీమలో 1977లో స్థాపించిన పశువైద్యశాల ద్వారా ఆరు పంచాయతీల పరిధిలోని 5 వేల పశువులకు చికిత్స అందిస్తున్నారని, గతంలో నిర్మించిన భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

పాడి పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుగా వెటర్నరీ ఆసుపత్రికి నూతన భవనం మంజూరు చేయాలని పోలవరం ప్రాంత ప్రజల తరఫున ఎంపీ మహేష్ కుమార్ మంత్రిని అభ్యర్థించారు.

ఎంపీ మహేష్ కుమార్ వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. తన విన్నపానికి తక్షణం స్పందించి ఆదేశాలు జారీ చేసిన మంత్రికి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.