ఏలూరు జిల్లా ఏలూరు : The Desk : ధవళేశ్వరంలోని పోలవరం కుడికాలువ భూసేకరణ కార్యాలయం లో ఫైళ్ళ దగ్దం ఘటన పై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరా తీశారు. ఈ సంఘటన పై సమగ్ర విచారణ జరపాలని, ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా భాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను ఆయన ఆదేశించారు. దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతంలో ఇలాంటి సంఘటన కృష్ణానది ఒడ్డున ఎక్సైజ్ శాఖ ఫైళ్ళ దగ్దం జరగింది, మళ్ళీ ఈ రోజు ధవళేశ్వరం లో జరిగింది. ఇలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
