ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసా పించను పధకంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కారణంగా నవంబర్ 30వ తేదీనే లబ్దిదారులకు పెన్షన్ చెల్లించాలని జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ 1 వ తేది ఆదివారం కావున రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశం ల ప్రకారం నవంబర్ 30 వ తేదీ ఉదయం 6.00 గంటలకు ప్రారంభించాలని, 30 వ తేదీ శనివారం ఫించన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి 02.12.2024 తేదీన పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర తెలిపారు.
ఏలూరు జిల్లా లో డిసెంబర్ నెలలో 2,62,836 మంది ఫించన్ దారులకు 112.68 కోట్ల రూపాయిలు పంపిణీ చేయవలసి ఉండగా 30.11.2024 వ తేది న 100 శాతం ఫించన్లు పంపిణీ జరగాలని దానికి అనుగుణంగా అధికారులు చెరువులు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో డిసెంబర్ నెల ఫించన్లు ఒక రోజు ముందుగా 30.11.2024 న ఇస్తున్న విషయాన్ని ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలి,
అలాగే ఫించన్ పంపిణీ సిబ్బంది 5298 మంది తప్పకుండా ఉదయం 6 గంటల కు పంపిణీ ప్రారంభించాలని ఫించన్ పంపిణీ దారులు అందరూ మొదటి 4 గంటలలోపు పంపిణీ పూర్తి చేయాలని , ఎక్కడైనా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మునిసిపల్ కమిషనర్ లు పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు.
కార్యక్రమములో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ మరియు జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ఆర్.విజయరాజు, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పాల్గొన్నారు.