ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది, కూటమి నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎంపీ కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా భారత దేశంలో మహిళల విద్యకు మార్గదర్శకులుగా నిలిచారని ఎంపీ తెలిపారు.
సాంఘిక సంస్కరణ ఉద్యమం ద్వారా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని ఎంపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వీర్ల ప్రతాప్, కాట్రు బాలకృష్ణ, మాగంటి హేమసుందర్, ఎంపీ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.