The Desk…Eluru : ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగుపరిచేందుకు  ఉపక్రమించిన జిల్లా కలెక్టర్…

The Desk…Eluru : ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగుపరిచేందుకు ఉపక్రమించిన జిల్లా కలెక్టర్…

  • సుమారు 2 గంటలపాటు అణువణువున ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ ..
  • స్వయంగా ఓపి తీసుకొని ఆర్థోపెడిక్ విభాగంలో వైద్యం పొందిన కలెక్టర్..
  • ఇకపై తరచూ ఆసుపత్రి సందర్శన..
  • క్రిందిస్ధాయి నుంచి సూపరింటెండెంట్ స్ధాయివరకు అంకితభావంతో పనిచెయ్యాలి..
  • పిజి విద్యార్ధి సేవలు పొందేందుకు చర్యలు..
  • దోమల నివారణకు ఆసుపత్రిలో వారానికి రెండుసార్లు ఫాగింగ్ చెయ్యాలి..
  • పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్ట్ రద్దు..

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గాడిలో పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉపక్రమించారు. శుక్రవారం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు 2 గంటల పాటు ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని అణువణువున పరిశీలించారు.

సాధారణ పేషెంట్ గా వైద్యం పొందిన కలెక్టర్…

తొలుత కలెక్టర్ స్వయంగా ఓపి సెంటరు వెళ్లి తన ఫోన్ నెంబరు చెప్పి ఓపి తీసుకున్నారు. తీసుకున్న ఓపి నెంబరు ప్రకారం ఆర్థోపెడిక్ డాక్టర్ ను సంప్రదించి కాలికి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు వ్రాసిన మందుల చీటిని తీసుకొని మందులు ఇచ్చే కౌంటర్ వద్దకు వెళ్లి స్వయంగా మందులు తీసుకొని మందులను రిజిస్టర్ లో నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవలు నిమిత్తం రోగులు ముందుగా ఓపి సెంటర్ ను తెలియజేయడానికి వ్యక్తిని ఏర్పాటు చేశారా లేదా అని ఆరా తీశారు. అక్కడే ఉన్న అభా హెల్త్ కార్డు రిజిస్టేషన్ కేంద్రాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీశురు.

రోగులకు అందించే అన్ని వ్యాధులకు సంబంధంచిన మందుల స్టాక్ గురించి, కొరత గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలుపైన రోగుల నుండి సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని ఆరా తీశారు.

అదే విధంగా సదరన్ సర్టిఫికెట్ల కోసం వచ్చే రోగులు వేచిఉండటానికి సమయాన్ని వైద్యులను ఆరా తీశారు. డెంటల్ విభాగంలోని టాయిలెట్స్ ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ రన్నింగ్ వాటర్ ఉందా లేదా అని గమనించారు. రన్నింగ్ వాటర్ కు అవసరమైన ప్రతిపాధనలు సమర్పించాలని ఆదేశించారు.

మధుమేహం, బి.పి. పరీక్షా విభాగాన్ని, ఎక్స్ రే విభాగాన్ని పరిశీలించారు. ఎక్స్ రే ప్రోసెస్ చేసే విధానం అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులను, సిబ్బందిని ఆరాతీస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించి రోగులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు.

డా. యన్.టి.ఆర్. వైద్య సేవలు కౌంటర్ ను, ట్రీట్ మెంట్ సెంటర్లను, రసాయన పాథాలిజి సెంటర్ ను, బ్లడ్ బ్యాంక్, ప్లెట్ లేట్స్, ఐసియూ, సర్జికల్ ఐసియూ, వాష్ రూమ్స్, డయాలసిస్ యూనిట్, ఎంఆర్ఐ స్కానింగ్, తదితర విభాగాలను కలెక్టర్ క్షుణంగా పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలు విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల సమయం, పేర్ల ను అడిగి తెలుసుకున్నారు.

ఎట్టి పరిస్ధితుల్లోను పేదలకు ఆరోగ్య సేవలు అందించడంలో సిబ్బంది, డాక్టర్లు అలసత్వం వహించకుండా మానవతా దృష్టితో సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో పనిచేసే క్రిందిస్ధాయి నుంచి సూపరింటెండెంట్ స్ధాయి వరకు అంకితబావంతో రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు.

ఆసుపత్రి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ వ్యక్తులు ఉంచిన వాహనాలను గుర్తించి సంబంధిత వివరాలను ఆర్డిఓ కు అందజేయాలని సంబందిత సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో అంబులెన్స్ నిర్వహణ తీరును పరిశీలించారు. ట్రామా కేర్ సంబంధించిన అంబులెన్స్ కు రిపేర్లు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండాలని, పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత కాంట్రాక్టు రద్దు పరుస్తామని కలెక్టర్ హెచ్చరించారు. దోమల నివారణకు వారానికి రెండుసార్లు ఫాగింగ్ చేయాలని కార్పోరేషన్ సిబ్బందిని ఆదేశించారు.

ఇకపై తరచూ ఆసుపత్రిని సందర్శిస్తామని రోగులు, ప్రజలు చెప్పిన సమస్యలు తెలుసుకోవడంతోపాటు రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. డెలివరీ కేసుల నిమిత్తం వచ్చిన బంధువులు వేచిఉండే గదిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసకోవాలని సూచించారు.

కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.ఎస్. రాజు, డిఎంహెచ్ ఓ డా.ఎస్. శర్మిష్ట, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్ కుమార్, ఆర్.ఎం.ఓ. డి. దుర్గాకుమార్, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.