The Desk… Eluru : వరద బాధితుల సహాయార్థం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ

The Desk… Eluru : వరద బాధితుల సహాయార్థం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ

  • రూ. 2,01,000/- ల CMRF DD ను ఏలూరుఎమ్మేల్యే బడేటి కి అందజేసిన అసోసియేషన్

🔴 విజయవాడ/ఏలూరు : THE DESK :

ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో సేవలందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు.

వరద బాధితుల సహాయార్ధ నిమిత్తం, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరపున రెండు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల వారిని అభినందించారు. ఈ అసోసియేషన్ ఏలూరు జిల్లాలో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందించారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జి. రవిచంద్ర మాట్లాడుతూ… ప్రతి నియోజకవర్గంలోని నియోజవర్గ ఎమ్మెల్యేలకు వరద బాధితుల నిమిత్తం చెక్కులు అందజేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సయ్యద్ బాజీ, ఎం. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు..