ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
దీనిలో భాగముగా జిల్లాలో అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఇప్పటివరకు 1614 వాహనాలకు పన్నుల రూపేణా మరియు తదితర కేసులు నమోదు చేసి రూ.92,34,235 అపరాధ రుసుముగా విధించామన్నారు.
అదేవిధముగా విద్యాసంస్థల బస్సులకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 42 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు.
రోడ్డు భద్రతా కమిటీ సమావేశములో భాగముగా ఏలూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో 200 హెల్మెట్ కేసులు నమోదు చేసి 2 లక్షల రూపాయలను అపరాధ రుసుముగా విధించామన్నారు.
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లను ధరించాలన్నారు. లేనియడల 1000 రూపాయల జరిమానాతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తామన్నారు.
పన్ను చెల్లించకుండా తిరుగుతూ పట్టుబడిన రవాణా వాహనాలకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన పన్నుతో పాటుగా అదనంగా నూరు శాతం అపరాధ రుసుము విధించి వాహనాలను జప్తు చేస్తామని ఆయన అన్నారు.
ప్రతిఒక్క వాహనదారులు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ, రవాణా వాహనాలకు చెల్లించవలసిన పన్నులను మరియు కేసులను తక్షణమే చెల్లించాలన్నారు. ఈ వాహన తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.