ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఏలూరు రెండవ పట్టణంలో నివసిస్తున్న ఓ యువతికి ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వైద్యులు లాప్రోస్కోపీ చికిత్స చేసి ఆమె కడుపులో ఉన్న కిలోన్నర జుట్టు ఉండను బయటకుతీసినట్టు ఆశ్రమం ఆసుపత్రి సీఈఓ హనుమంతరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..
కొల్లేరు పరిధిలోని గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. పొట్ట ఉబ్బరంగా ఉండటం, వాంతులు అవుతుండటం, ఆకలి మందగించ డం వంటి సమస్యలతో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చూపించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితురాలిని ఆశ్రం ఆసుపత్రికి తీసుకురాగా.. జీర్ణకోశ వైద్యనిపుణుడు కృష్ణవర్ధన్ పరీక్షలు చేయించారు. పరీక్షలలో ఆమె పొట్ట భాగంలో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు.
వైద్యుడు యువతిని సమస్యపై విచారించగా..గత రెండు సంవత్సరాలుగా వెంట్రుకలు తినే అలవాటుందని తెలిపింది. దీంతో రెండు రోజుల కిందట నలుగురు వైద్యులతో కూడిన బృందం శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో ఉన్న కిలోన్నర వెంట్రు కల ఉండను బయటకు తీశారు. సమస్యను తొలగించి యువతిని రక్షించిన వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.