The Desk…Eluru : ఘనంగా మడుపల్లి మోహన్ గుప్తా 80వ జన్మదిన వేడుకలు

The Desk…Eluru : ఘనంగా మడుపల్లి మోహన్ గుప్తా 80వ జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

ఏలూరు నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త గుప్తా ఫౌండేషన్ అధినేత మడిపల్లి మోహన్ గుప్తా 80 వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి, టిడిపి నాయకుడు బొద్దాని శ్రీనివాస్, ఏలూరు నగర మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు చౌడే వెంకటరత్నం పలువురు నగర ప్రముఖులు గుప్తాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మోహన్ గుప్త మాట్లాడుతూ.. ఏలూరు నగరంలోని వెంకన్న చెరువు వద్ద ఉన్న స్మశాన వాటికను కోటి రూపాయలతో అభివృద్ధి చేసేందుకు స్థానిక శాసనసభ్యులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

అంతేకాకుండా ఈ సంవత్సరం శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారమునకు పోవూరి లలిత కుమారికి అవార్డు ప్రకటించడం జరిగింది. వీటీతో ప్రశంస పత్రం జ్ఞాపిక 3 లక్షల రూపాయల నగదు పురస్కారం త్వరలో అందించడం జరుగుతుందని తెలిపారు.

గుప్తా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి తమ తండ్రి గారి పేరు మీద శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డును ఇప్పటివరకు 20 మందికి అందించడం జరిగిందన్నారు.