🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోనే ప్రప్రథమంగా ఏలూరు సత్రంపాడులోని ఎమ్మార్సీ కాలనీ అంబేద్కర్ నగర్ లోని దేవా మోషే ఇంటిపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి లబ్ధిదారుడు మోషే చేతులు మీదుగా దీన్ని ప్రారంభింపజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం ప్రజలకు ఎంతో మేలు చేసేదిగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ గృహాలపై రెండు కిలోవాట్ల సౌకర్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ఉచితంగా అమర్చడం జరుగుతుందని చెప్పారు. దీని ద్వారా 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతుందని, ఈ వర్గాలకు 200 యూనిట్లు వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుందని, సూర్యఘర్ లో ఉత్పత్తి అయ్యే మిగిలిన నలభై యూనిట్ల కరెంటును విద్యుత్ శాఖ తీసుకుని లబ్ధిదారునికి చార్జీలు చెల్లిస్తుందని తెలిపారు. అలాగే మిగిలిన వారు కూడా సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తుందని చెప్పారు.
ఆర్టీసీ విజయవాడ జోన్- 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ :
అన్ని వర్గాల ప్రజల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి వెసులుబాటు కల్పించే పథకాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయని చెప్పారు. ప్రతి ఒక్కరు సౌర విద్యుత్తును వినియోగించుకుంటే కరెంటును ఆదా చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
AP EPDCL ఎస్ఇ సాల్మన్ రాజు మాట్లాడుతూ :
మొట్టమొదటిసారిగా జిల్లాకు సంబంధించి ఏలూరులోనే సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ లబ్ధిదారుని గృహంపై సౌర విద్యుత్తు ఫలకాలు అమర్చినట్లు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, క్లస్టర్ కో ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు, డివిజన్ ఇంచార్జిలు కొండే రాణి నిర్మల కుమారి, అట్లూరి రామకృష్ణ, డివిజన్ కో ఇన్చార్జిలు మద్దు ప్రసాద్, కేతినిడి కిషోర్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ముళ్ళపూడి అశోక్, వేల్పుల అరుణ, సతీష్, చందు, జనసేన నాయకులు వీరంకి పండు, బిజెపి నాయకులు నడపన భాస్కరరావు, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ అంబేద్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Eluru MLA Inaugurates First Surya Ghar Panels in ELURU District
Eluru MLA and TDP district president Badeeti Chanti launched the district’s inaugural Surya Ghar scheme installation at Deva Moshe’s residence in Satramapadu’s MRC Colony, Ambedkar Nagar. He urged SC/ST communities to leverage the initiative for sustainable energy benefits.
Speaking at the event, Chanti highlighted the NDA coalition government’s focus on development alongside equal opportunities for all sections through welfare schemes. Under PM Surya Ghar, 2 kW solar panels are installed free on SC/ST homes, generating 240 units monthly. The government supplies 200 units free, while the electricity department purchases excess 40 units, compensating beneficiaries directly.
“Central and state governments’ schemes truly uplift people,” Chanti said. “Others can install panels with up to ₹78,000 subsidy.” He emphasized harnessing solar power for electricity savings and self-reliance.
RTC Vijayawada Zone-2 Chairman Reddy Appalanayudu noted government support for financially strained families via relief measures. “Adopting solar reduces bills significantly,” he added.
AP EPDCL SE Salman Raju confirmed this as Eluru’s first under the scheme for an SC beneficiary, marking a milestone.
The event saw participation from AMC Chairman Mamillapalli Parthasarathi, Eeda Chairman Peddaboyina Shivaprasad, CO option members SMR Pedababu and Chode Venkataratnam, cluster in-charges RNR Nageswar Rao and RNR Rajeshwar Rao, division in-charges Konda Rani Nirmala Kumari and Atloori Ramakrishna, deputy in-charges Maddu Prasad and Ketinidi Kishore, BSNL Advisory Board Director Lanka Palli Manikyala Rao, TDP leaders Mullapoodi Ashok, Velpula Arun, Satish, Chandu, JSP’s Viranki Pandu, BJP’s Nadapana Bhaskar Rao, APEPDCL EE Ambedkar, Deputy EE Raj Kumar, and alliance party leaders.

