🔴 హైదరాబాద్/ఏలూరు : ది డెస్క్ :
హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో, తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని తనను ఎంపిగా గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఘటనలో తన పేరు రావడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఎంపీ, ఆ రోజు డిన్నర్ కు హాజరు అయిన మాట వాస్తవమే అయినా, తాను ఎటువంటి తప్పు చేయలేదని, విచారణలో నిర్ధోషిగా బయటకు వస్తాననే నమ్మకం వెలిబుచ్చారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఈ అంశంపై పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న ఎంపీ, అదే సందర్భంలో పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని, పార్టీ నుండి అందిన నోటీసుపై లిఖిత పూర్వకంగా అధిష్టానానికి వివరణ ఇస్తాననీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ సంఘటన నుంచి, తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఎప్పటిలా కట్టుబడి పనిచేస్తానని ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నానని తన ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.
MP Putta Mahesh Denies Drugs Case Involvement, Vows to Prove Innocence
Eluru MP Putta Mahesh Kumar expressed profound distress over his name surfacing in a Hyderabad drugs-related incident, asserting he has committed no wrongdoing and will emerge innocent.
In a statement to media addressing Eluru constituency voters, the MP clarified that while he attended a dinner that day, he is blameless. “I have done nothing wrong and will prove my innocence in investigations,” he affirmed, pledging full police cooperation.
Mahesh assured party high command compliance, promising a written response to their notice. Committed to Eluru’s development, he vowed to rededicate efforts post-clearance, urging public trust.

