🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు అగ్రహారంలోని ఎస్వీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత డయాలసిస్ సేవలతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డయాలసిస్ చేయించుకున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని హితవు పలికారు. ఆహారం తీసుకునే విషయంలో నిర్లక్ష్యం కారణంగా చిన్నతనంలోనే కిడ్నీలు దెబ్బతిని ఎంతోమంది డయాలసిస్ చేయించుకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఎక్కువమంది రక్తదానం చేసే విధంగా చైతన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. నగరంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కన్నెగొళ్ల రామచంద్ర రావు ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పి ఎంతోమందికి సేవలందించడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డివిజన్ ప్రెసిడెంట్ మోహన్ బోస్లే, డాక్టర్ కన్నెగొళ్ల రామచంద్ర రావు, డాక్టర్ కన్నెగొళ్ల కార్తీక్, డాక్టర్ కన్నెగొళ్ల అనుదీప్, డాక్టర్ మానస, అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఇన్చార్జి కె. శివకుమార్, ఆసుపత్రి మేనేజర్ కమలాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు తూతా శ్రీను పలువురు పాల్గొన్నారు.
Eluru MLA Promotes Healthy Eating on World Kidney Day
Eluru MLA Badeti Chanti emphasized that adopting good food habits from childhood ensures a healthy life, especially urging youth to be cautious with their diet. Speaking at the World Kidney Day event on Thursday, organized by SVS Multi-Specialty Hospital and Apollo Dialysis Clinics in Eluru Agraharam, he highlighted how dietary negligence leads to early kidney damage, forcing many into dialysis.
The program offered free dialysis services alongside a blood donation camp, which the MLA inaugurated after distributing fruits to dialysis patients. Chanti called for greater awareness on blood donation to encourage more participation. He commended prominent homoeopath Dr. Kannegollla Ramachandra Rao for establishing the multi-specialty hospital, providing healthcare and jobs to many.
Chanti advised everyone to cultivate nutritious eating habits early to prevent health issues. Attendees included AMC Chairman Mamillapalli Parthasarathi, IDA Chairman Peddiboyina Shivaprasad, Eluru TDP City President Chode Venkataratnam, Division President Mohan Bosle, Drs. Kannegollla Ramachandra Rao, Kartheek, Anudeep, Manas, Apollo Dialysis In-charge K. Shivakumar, hospital manager Kamalakhar, and TDP leaders like Toota Srinu.

