The Desk … Eluru : మహిళల గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం మాది➖ఎంపీ పుట్టా మహేష్

The Desk … Eluru : మహిళల గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం మాది➖ఎంపీ పుట్టా మహేష్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

అన్ని పథకాల్లో మహిళలకు అగ్రస్థానం కల్పిస్తున్నాం

దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన నేత ఎన్టీఆర్

కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మరే ప్రభుత్వం ఇవ్వలేదు.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

‎అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి08) సందర్భంగా ఏలూరు జిల్లా  తెలుగింటి ఆడపడుచులకు, మహిళామణులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని, సమాజంలో వెలుగులు నింపే శక్తి మహిళలకే ఉందని బలంగా నమ్మి పనిచేస్తూ, మహిళ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తన ప్రకటనలో తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.



‎తాజాగా 2026- 27 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ.4,581 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు  కేటాయించడం మహిళల సంక్షేమంపట్ల కూటమి ప్రభుత్వానికిగల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద ఇప్పటివరకూ 90లక్షల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు.

మహిళలను మహాశక్తులుగా మార్చేందుకే “మహాశక్తి పథకం” ప్రకటించామన్నారు.  మహిళలకు ప్రత్యేకంగా 22 సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. ప్రతి తల్లి, చెల్లి, ప్రతి ఇల్లు బాగుంటేనే నిజమైన మహిళా సాధికారిత అని ,ఆ దిశగా అందరూ అడుగులు వేద్దామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.