ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
“మేరా యువ భారత్-మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ” ఆధ్వర్యంలో, నేషనల్ సైన్స్ డే అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ జి.గిరిబాబు మాట్లాడుతూ.. సైన్స్ అనేది మానవ జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో మానవునికి ఏ విధంగా దోహదపడుతుందో వివరించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు క్విజ్ కాంపిటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటేషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సెట్ వెల్ సీఈవో ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు.
కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ అజయ్ బాబు, ఎకనామిక్స్ రాంబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయ్ కుమార్, పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు దుర్గాప్రసాద్ రావు, కాలేజ్ స్టాఫ్, మైభారత్ యువ వాలంటీర్ చేతన తదితరులు హాజరయ్యారు.

