🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
ప్రభుత్వ సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం.
నాడు మైక్రోసాఫ్ట్ రాకతోనే హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధి.
నేడు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సహకారం.
సంజీవని ప్రాజెక్టుకు సహకారంపై గేట్స్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ.
బిల్ గేట్స్ పర్యటన డిజిటల్ గిఫ్ట్ గా వర్ణించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు బిల్ గేట్స్ టీంకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
సోమవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్న బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో భేటీ అయిన సందర్భంలో అంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించిన ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పర్యటనకు రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు సంతోషకరమైన విషయం అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
నాడు మైక్రోసాఫ్ట్ రాకతోనే హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి తొలి అడుగు పడి, నేడు లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సారి ఐటీ సహా అనేక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు బిల్ గేట్స్ ముందుకు రావటం రాష్ట్ర అభివృద్ధికి “గ్రోత్ ఇంజన్” లా పని చేస్తుందనే అశాభావాన్ని వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని, సాంకేతికత అభివృద్ధి, పరిశోధనల్లో ఏపీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు ఆ దిశగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేసిన విషయాన్ని, గూగుల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని ఎంపీ తన ప్రకటనలో ప్రస్తావించారు.
బిల్ గేట్స్ పర్యటనతో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహకారంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి తేవడం, తెగుళ్లను ముందుగానే గుర్తించే సాప్ట్ వేర్ ను అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకురావడం మన రాష్ట్ర రైతాంగానికి డిజిటల్ గిఫ్ట్ గా అభివర్ణించారు.

